Introductory Offer

నియమ నిబంధనలు

1. వేద విజ్ఞాన సమితి - దైవారాధన కిట్ -  వేద విజ్ఞాన సమితి ట్రస్ట్ చే సహజసిద్ధంగా తయారు చేయబడిన 1) పూజ అగరు వత్తులు (50gms x 6 ప్యాకెట్లు), 2) మహతి దీపారాధన నూనె (500ml x 1), 3) మహతి స్వచ్ఛమైన పసుపు (50gms x 1),  4) మహతి స్వచ్ఛమైన కుంకుమ (50gms x 1) అనే 4 రకాల వస్తువులతో అందుబాటులో ఉన్నది. 

2. దైవారాధన కు వినియోగించే వస్తువులన్నీ స్వచ్ఛమైనవి, సహజసిద్ధమైనవిగా ఉండాలని, మనం వాడటానికి పనికిరాని, మరియు మనకు, పర్యావరణానికి హాని కలిగించే ఏ వస్తువులైనా దైవానికీ వినియోగించరాదు అనే చైతన్యాన్ని సమాజంలో విస్తృతంగా వ్యాప్తి చేసే సత్సంకల్పంతో, వేద విజ్ఞాన సమితి ట్రస్ట్ ఆయా వస్తువుల తయారీ చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.

3. వేద విజ్ఞాన సమితి ట్రస్ట్ తయారు చేస్తున్న స్వచ్ఛమైన, నాణ్యమైన వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించే దిశగా, సమాజంలో చైతన్యం కల్పించేందుకు - పైన తెలిపిన నాలుగు వస్తువులతో కూడిన దైవారాధన కిట్ వినూత్నమైన , అద్వితీయమైన ఆధ్యాత్మిక ఆకర్షణలతో - పరిచయ ఆఫర్ తో పాటు మీ ముందుకు వచ్చింది.

4. ఈ అద్భుతమైన పరిచయ ఆఫర్ నుండి - ప్రతీ కిట్ లో ఉండే స్క్రాచ్ కార్డ్ ద్వారా తిరుపతి, శ్రీశైలం, అరుణాచలం, ‌షిర్డి పుణ్యక్షేత్రాలకు బస్, రైలు, విమాన టికెట్లను తిరుమల శ్రీవారి విఐపి దర్శన భాగ్యాన్నీ కల్పించబోతుంది.

5. ఈ పరిచయ ఆఫర్ కేవలం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో నివశిస్తున్నవారికి మాత్రమే అందుబాటులో ఉంది.

6. ఈ పథకంలో మీరు స్క్రాచ్ కార్డ్ ద్వారా గెలుచుకొన్న అన్ని రకాల టిక్కెట్లను గరిష్టంగా 120 రోజుల లోపు వినియోగించుకొనవలెను. విఐపి దర్శన భాగ్యం పొందిన విజేతకు తప్ప ఇతర టిక్కెట్ల విజేతలకు దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లలో వేద విజ్ఞాన సమితి ట్రస్ట్ బాధ్యత వహించదు. ఆయా విజేతలు దర్శనం కొరకు తగిన ఏర్పాట్లు చేసుకొనవలెను. ఆయా విజేతల నిర్ధారిత నివాస స్థానానికి దగ్గరలోని బస్/రైల్వే స్టేషన్ లేదా విమానాశ్రయం నుండి రాను, పోను టికెట్లు అందజేయబడతాయి. తిరుమల విఐపి దర్శనం గెలుచుకొన్న విజేతకు వారి నివాస స్థానానికి దగ్గర లోని రైల్వే స్టేషన్ నుండి రైలు టిక్కెట్లు మరియు విఐపి దర్శనం కొరకు తితిదే - శ్రీవాణి టికెట్ అందించబడతాయి. ఈ సదుపాయం తిరుమల తిరుపతి దేవస్థానం వారి నియమ నిబంధనలకు లోబడి మాత్రమే ఉంటుంది. 

7. దైవారాధన కిట్ మీరు ఆర్డర్ చేసిన నాటి నుండి 7 నుండి 10 పని దినాల లో మీకు స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా అందించబడుతుంది.

8. ఈ దైవారాధన కిట్స్ - పరిచయ పథకం 15 మే 2025 నుండి 30 ఏప్రిల్ 2026 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ పథకం లో మరిన్ని ఆకర్షణలు చేర్చేందుకు ఎప్పటికప్పుడు తగిన మార్పులు, చేర్పులు చేయబడతాయి. పూర్తి సమాచారం www.vvstindia.org వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుంది.

9. ఈ పథకం ద్వారా వ్యక్తిగతంగా ఉపయోగించుటకు కానీ, ఆదాయం, ఆదరణ లేని ఆలయాలకు మీరు స్వయంగా అందించుటకు కానీ దైవారాధన కిట్ ను కొనవచ్చు. 

10. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం స్వచ్ఛమైన వస్తువులను మాత్రమే దైవిక సేవలకు వినియోగించవలెననే చైతన్యం పెంపొందించుట ,ఆధ్యాత్మిక యాత్రలను ప్రోత్సహించుట, మరియు చిన్న ఆలయాలకు ధూపదీప నైవేద్య సేవలను అందించు వేద విజ్ఞాన సమితి - దైవారాధన కార్యక్రమాన్ని మరిన్ని ఆలయాలకు విస్తరించుట. ఇంతకు మించి ఎటువంటి లాభాపేక్ష, వ్యాపార ప్రయోజనాలు ఈ కార్యక్రమం ద్వారా సంస్థకు ఉండబోవు. 

11. ఈ కార్యక్రమ నిర్వహణ, కొనసాగింపు, ముగింపు లేదా మరే ఇతర అంశాలలోనైనా నిర్వాహకులదే తుది నిర్ణయం. ఎటువంటి వాదోపవాదాలు, వివాదాలకు తావు లేదు.